ETV Bharat / state

తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు.. రూ.11కోట్లకు చేరువలో ఆదాయం

Medaram Jatara Income 2022: మేడారం జాతర హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల... లెక్కింపు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.11 కోట్లకు చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు
తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు
author img

By

Published : Mar 5, 2022, 12:26 PM IST

Medaram Jatara Income 2022: హనుమకొండ జిల్లా కేంద్రంలో మేడారం వనదేవతలకు భక్తులు సమర్పించిన కానుకల హుండీల లెక్కింపు తుది దశకు చేరుకుంది. టీటీడీ కళ్యాణ మండపంలో ఎనిమిది రోజులుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఆదాయం రూ.10,91,62,765 ఆదాయం వచ్చినట్లు మేడారం ఆలయ ఈవో తెలిపారు. ఆదాయం రూ.11 కోట్లకు చేరువలో ఉంది. ఇంకా నాణేలు, ఆభరణాలు, విదేశీ కరెన్సీ ఇతర కానుకలను లెక్కించాల్సి ఉంది.

కానుకల హుండీల లెక్కింపు
కానుకల హుండీల లెక్కింపు

పటిష్ఠ భద్రత నడుమ లెక్కింపు..

సీసీ కెమెరాల పటిష్ఠ భద్రతల మధ్య మేడారం హుండీ లెక్కింపు జరుగుతోంది. హుండీల్లో డబ్బులతో పాటు వెండి ఆభరణాలు వస్తున్నాయి. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేస్తున్నారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు జరగనుంది. ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని అధికారులు బ్యాంకుల్లో జమచేస్తున్నారు.

రూ.11కోట్లకు చేరువలో ఆదాయం
రూ.11కోట్లకు చేరువలో ఆదాయం

ఈసారి పెరిగిన భక్తుల సంఖ్య

2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్ల 54 లక్షల 71 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపేణా రూ.11 కోట్ల 65 లక్షలు.. వాటితో పాటు కిలో 63 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. గతంలో 502 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం మహా జాతరలో ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. తల్లులను దర్శించుకున్నారు. నెల ముందు నుంచి... జాతర వరకూ కోటి ముప్పై లక్షలకుపైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు. జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా దాదాపు పదిలక్షలపైగా భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే.. మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికిపైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. తాగునీటి విషయంలో.. జనం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు
తుదిదశకు మేడారం హుండీల లెక్కింపు

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.