ETV Bharat / state

మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు

గిరిజన దైవం సమ్మక్క-సారక్క జాతర మేడారంలో అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు భారీగా తరలొస్తున్న భక్తులు లైన్లలో నిలబడి నీరసపడిపోతున్నారు. నీటి శాతం అధికంగా ఉన్న కీరదోస, పుచ్చకాయ తినడానికి ఇష్టపడుతున్నారు.

author img

By

Published : Feb 7, 2020, 5:13 PM IST

heavy sale cucumber and water millan in  medaram jathara
మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు తరలొస్తున్న భక్తులతో పుచ్చకాయ, కీరదోసకు మంచి గిరాకీ ఏర్పడింది. తల్లుల దర్శనం కోసం గంటల కొద్ది లైన్లలో నీరు, ఆహారం లేకుండా గడుపుతున్న భక్తులు... దర్శనానంతరం బయటికి వచ్చి ఆకలితో పాటు దాహార్తి తీర్చుకునేందుకు నీటి శాతం అధికంగా ఉన్న పుచ్చకాయ, కీరదోసను ఆశ్రయిస్తున్నారు.

ఫలితంగా ఎక్కడ చూసిన పుచ్చకాయ బండ్ల వద్ద భక్తులు అధికంగా కనబడుతున్నారు. నెల రోజుల్లో అమ్మే సరుకులను కేవలం ఒక్క రోజులోనే అమ్ముకుంటూ లాభాలను గడిస్తున్నారు చిరువ్యాపారులు.

మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు

ఇవీ చూడండి: 'ఐదుగురికి ఉరిశిక్ష వేయడం అభినందనీయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.