ములుగు జిల్లా వాజేడు మండలంలో రాత్రి నుంచి జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాజేడు మండలం ధర్మారం గ్రామ శివార్లలోని కల్వర్టును వరద ముంచేసింది. వరద నీటిని ఖాతరు చేయకుండా ఓ ద్విచక్రవాహనదారుడు కల్వర్టు దాటేందుకు విఫలయత్నం చేశాడు. వరద ప్రవాహానికి అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. రక్షించాలని కేకలు వేయడాన్ని గమనించిన స్థానికులు చేయి.. చేయి కలిపి ఒడ్డుకు చేర్చారు.
ఇవీ చూడండి: మెడికో గల్లా పట్టిన పోలీసు.. విజయవాడలో ఉద్రిక్తత