మేడారం జాతరలో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. అమ్మవార్లకు తలనీలాలు సమర్పించుకుంటున్న భక్తుల నుంచి ఒక్కొక్కరికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు.
జుట్టు అమ్మకపోతే సగం గుండు గీసీ మధ్యలోనే వదిలేస్తున్నారంటూ బాధితులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ మహిళ తలనీలాలు సమర్పించుకునేందుకు రాగా... గుండు గీయడం ప్రారంభించి, జుట్టును తమకు అమ్మితేనే మిగిలిన భాగం గుండు చేస్తామని తెలుపగా భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారికి తలనీలాలు సమర్పిస్తే జుట్టు ఎందుకు అమ్మాలి, డబ్బులు ఎందుకు చెల్లించాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: ఆద్యంతం.. కోలాహలమే.. నేడు సారలమ్మ ఆగమనం