ETV Bharat / state

'మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి' - రైతుల ధర్నా

ములుగు జిల్లా గోవిందరావు పేట గ్రామంలోని పోలీస్​ బెటాలియన్​ భవన భూ నిర్వాసితులు తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరసనలు చేపట్టారు.

farmers-protest-in-mulugu
'మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి'
author img

By

Published : Dec 22, 2019, 3:13 PM IST

ములుగు జిల్లా గోవిందరావుపేటలో టీఎస్​ఎస్పీ అధికారులు చేపట్టిన తాత్కాలికి ఉద్యోగుల నియామకాల్ని నిరసిస్తూ భూ నిర్వాసితులు గ్రామంలోని నీళ్ల ట్యాంక్​ ఎక్కి ఆందోళన చేపట్టారు. పోలీస్​ బెటాలియన్​కి కేటాయించిన ఆ భూముల్లో తాత్కాలిక నియమకాలు చేపట్టిన అధికారుల చర్యలను ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక మహిళా రైతు ట్యాంక్​పై నుంచి దూకడానికి ప్రయత్నించగా మిగిలిన రైతులు ఆమెను అడ్డుకున్నారు.

భూములు కోల్పోయిన తమ పిల్లలకే తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.. లేని ఎడల ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. ఎమ్మెల్యే సీతక్క, ములుగు దేవేందర్​ రెడ్డి, ఆర్డీఓ రమాదేవి ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కలెక్టర్​తో మాట్లాడి భూముల కోల్పోయిన రైతుల పిల్లలకు ఉద్యోగాలు, భూముల కింద భూములు ఇప్పించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడం వల్ల రైతులు ఆందోళన విరమించారు.

'మా పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వాలి'

ఇదీ చూడండి: రైలు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

Intro:tg_wgl_51_22_raithula_dharna_vo_ab_ts10072
G Raju mulugu contributor
యాంకర్ వాయిస్: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గ్రామ శివారులో ఉన్న 928 సర్వేనెంబర్ లో 5వ పోలీస్ బెటాలియన్ కోసం ప్రభుత్వం సేకరణ చేపట్టింది పోలీస్ బెటాలియన్ భూసేకరణలో వివాదాలు కొనసాగుతున్నాయి. తాతల కాలం నుంచి తాము భూములను సాగు చేసుకుంటున్నామని స్థానిక రైతులు అడ్డగించడం తో ఆఫీసర్లు చర్యలు చేపడతామని తెలిపారు. వంద ఎకరాల భూమి కి బదులు 150 ఎకరాలు శేఖర్ ఇస్తున్నారని రీ సర్వే చేయించాలని నిర్వాసితులు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బీట్ ఆఫీసర్ ను కలిశారు. ఈ నేపథ్యంలో మాట మాట పెరిగి సర్పంచ్ ను కూడా సదరు ఆఫీసర్ దూషించిన ట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. దీంతో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు .గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కిన 10 మంది భూనిర్వాసితులు వెంటనే రీ సర్వే చేయాలని దూషించిన పోలీసు ఆఫీసర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ములుగు డిఆర్ఓ రమాదేవి అక్కడికి వచ్చి నిర్వాసితుల తో మాట్లాడుతూ 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే సీతక్క సంఘటన స్థలానికి చేరుకొని నిర్వాసితుల తో మాట్లాడగా భూ నిర్వాసితులు ట్యాంక్ దిగివచ్చారు. బెటాలియన్ కింద కోల్పోయిన భూమికి బదులుగా తమకు భూమి ఇవ్వాలని బాధితులు కోరగా అందుకు సాధ్య అసాధ్యాలను పరిశీలిస్తామని అప్పటి వరకు ఎలాంటి ఆందోళనలు చేయవద్దని విఆర్ఓ సూచించారు ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చర్చిస్తామని ఎమ్మెల్యే సీతక్క వారితో తెలిపారు ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ములుగు రెడ్డి శ్రీనివాస్ ఎస్ఐ మహేంద్ర కుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారుBody:SsConclusion:బైట్స్ తాటి రమాదేవి డిఆర్ఓ ములుగు
సీతక్క ములుగు ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.