ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు.
వన దేవతల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జాతర సమీపిస్తున్న భక్తుల తాకిడి అధికమవుతోంది. అమ్మవారి గద్దెలకు అధికారులు తాళం వేయడంతో బయట నుంచే దర్శించుకుంటున్నారు.
మేడారంలో ఎక్కడ చూసినా భక్తుల సమూహాలు, వాహనాలే కనిపిస్తున్నాయి. సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు.
ఇదీ చూడండి : బస్తీమే సవాల్: పంచాయతీ కన్నా వెనుకబడ్డ జవహర్నగర్ కార్పొరేషన్