ETV Bharat / state

సెలవు రోజున మేడారంకు పోటెత్తిన భక్తులు - మేడారం తాజా వార్త

ఆదివారం సెలవురోజు కావడం వల్ల ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు.

devotees-in-medaram-in-mulugu
సెలవు రోజున మేడారంకు పోటెత్తిన భక్తులు
author img

By

Published : Dec 15, 2019, 7:46 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ రోజు సెలవు దినం కావడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా కలిసి వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మలకు పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చు తల్లీ అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు మొక్కుతున్నారు. గిరిజనుల ఆరాధ్యదైవమైన వనదేవతలకు మొక్కితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

సెలవు రోజున మేడారంకు పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి: ధనుర్మాసం... కోరిన వరుడు వస్తాడని ఆడపిల్లల విశ్వాసం..!

Intro:tg_wgl_51_15_medaramlo_bhaktha_jenam_ab_ts10072_HD
G Raju mulugu contributor

యాంకర్ వాయిస్: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ వనదేవతల ను దర్శించుకునేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ రోజు సెలవు దినం కావడంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల నుంచి భక్తులు పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా కలిసి వచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు లకు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. కోరిన కోరికలు తీర్చు తల్లి అంటూ భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు తీరొక్క మొక్కలు మొక్కుతున్నారు. గిరిజనుల ఆరాధ్యదవమైన వనదేవతలకు మొక్కుతే కోరిన కోరికలు కచ్చితంగా కోరిక నెరవేరుతుందని భక్తులు అన్నారు. కోరిన కోరిక నెరవేరినందుకు ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవార్లను దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వస్తున్నామని అంటున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంటుందని ఎప్పటికీ పట్టణ ప్రపంచంలోనే నివసిస్తున్నామని అందుకనే ప్రకృతిని తలపించే ప్రాంతమైనటువంటి మేడారం జాతరకు వచ్చి ఆనందంగా ఈ ప్రకృతిని ఆస్వాదించవచ్చని మనసు తృప్తితో తిరుగు ప్రయాణం చేస్తున్నామని భక్తులు అంటున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం మహా జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని భక్తులు డిమాండ్

Body:ss

Conclusion:బైట్స్ 1: శ్రీనివాసరావు భక్తుడు హైదరాబాద్
2: రణదీప్ భక్తుడు వరంగల్
3 : రమణి భక్తురాలు కరీంనగర్
4: కుమార్ భక్తుడు ములుగు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.