ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో కుటుంబ సమేతంగా రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి వన దేవతల సన్నిధికి చేరుకున్నారు.
జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి తల నీలాలు సమర్పించుకుని అమ్మ వార్ల దర్శనం చేసుకుంటున్నారు. నిలువెత్తు బంగారం (బెల్లం)తో సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులకు మొక్కులు సమర్పించుకుంటున్నారు. కొంగుబంగారంగా పసుపు, కుంకుమలు తీసుకొని పూజారుల చేతుల మీదుగా ఆ వనదేవతల ఆశీస్సులు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: కాకతీయుల కాలం నాటి రాతి క్వారీ గుర్తింపు