Devotees in Medaram: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో సమ్మక్క-సారలమ్మ వనదేవతల దేవాలయం ఒక్కసారిగా కిటకిటలాడింది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాక.. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.
మొదటగా జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. తలనీలాలు సమర్పించుకుని అమ్మవారికి పూజలు చేశారు. వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరలు కట్టి నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు.
అమ్మవారి సేవలో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే సీతక్క
MLA seethakka in medaram: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా వచ్చి సమ్మక్క-సారలమ్మ వన దేవతలను దర్శించుకున్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క కుటుంబంతో సహా వచ్చి అమ్మవార్లకు పూలు, పళ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్ల మొక్కులు చెల్లించుకున్నారు.
మేడారం జాతరకు ఏర్పాట్లు
Arrangements for jatara: వచ్చేనెలలో జరగనున్న మేడారం జాతరకు ఆలయంలో ఏర్పాటు చేస్తున్నారు. రెండేళ్లకొకసారి జరిగే మేడారం జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు.
- ఇవీ చూడండి:
- Medaram Jatara 2022: వనదేవతల పండుగ.. మేడారం మహా జాతరకు ముమ్మర ఏర్పాట్లు
- Kishan Reddy: 'మేడారం జాతరకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెస్తాం..'
- రామప్పను ప్రపంచం గుర్తించింది... మేడారం జాతరను కేంద్రం గుర్తించలేదా..?
- Medaram Jatara: మేడారం జాతరకు ముమ్మర ఏర్పాట్లు.. 18 బావుల్లో పూడికతీత
- Medaram Jatara Rtc Buses: మేడారం జాతరకు 3845 ఆర్టీసీ బస్సులు..