ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో ఎఫ్58 సీఆర్పీఎఫ్ అధికారులు 140 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో నిరుపేదలు ఇంటిపట్టునే ఉండడం గమనించిన జవాన్లు అన్నదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పవన్ యాదవ్, ఇన్స్పెక్టర్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కరోనా ఉన్మాదం: బాధితుల మూత్రం సీసాలు విసిరి...