ETV Bharat / state

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ' - MULUGU MLA

రైతులకు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పట్టా పాసు పుస్తకాలను అందజేయాలంటూ ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఆందోళన నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే... సవతి తల్లి ప్రేమ చూపినట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు.

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ'
author img

By

Published : Jun 15, 2019, 3:22 PM IST

ములుగు జిల్లా కేంద్రంలో రైతులకు మద్ధతుగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి రైతులకు సకాలంలో పట్టా పాసు పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు 95 శాతం పాసు పుస్తకాలు అందజేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఏకకాలంలో రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలను ఇస్తామని చెప్పి మోసగించారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.

'రైతులపై కేసీఆర్​కు సవతి తల్లి ప్రేమ'

ఇవీ చూడండి: పొట్ట కూటికోసం పోయి... పోలీసుల చెరలో చిక్కారు

Intro:tg_wgl_51_14_patta_pasupasthakosam_congress_darna_ab_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ : రైతు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పట్టా పాస్ బుక్కులను అందజేయాలని కాంగ్రెస్ పార్టీకి సెల్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఆందోళన నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న కేసీఆర్ పాలన రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు

Body:వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని రైతులతో కలిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులకు సకాలంలో పట్టా పాసు పుస్తకాలు అందించకపోవడం మూలంగా రైతులు పండించిన పంటను అమ్ముకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్రం పేరుతో పట్టా పాసు పుస్తకాలు ఇప్పటికీ 95 శాతం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం నిరంకుశ పాలనకు రైతుల ఆందోళన అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40% పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేసి ధరణి వెబ్సైట్ పేరుతో రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని వారు అన్నారు. ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలను కంచి పట్టు పాస్ బుక్కులను రైతులకు అందించినట్లయితే రైతులందరికీ రైతుబంధు పథకం సకాలంలో అందుతుందని, గతంలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన రైతుల సర్వే నెంబర్లను ను గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు.

Conclusion:బైట్స్ : అవినాష్ రెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
: ధను సరి అనసూర్య (సీతక్క) ములుగు ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.