ములుగు జిల్లా కేంద్రంలో భాజపా ర్యాలీ నిర్వహించింది. పీఆర్సీని వెంటనే అమలు చేయాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి... ఇప్పటివరకు పీఆర్సీ అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడం సబబు కాదని... వెంటనే దానిని అమలు చేయాలని లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'పీఆర్సీ, ఐఆర్ ఇవ్వలేని పరిస్థితిలో తెరాస ప్రభుత్వం ఉంది'