ETV Bharat / state

Medaram Prasadam: ఈసారి ఇంటి వద్దకే మేడారం ప్రసాదం... డోర్​ డెలివరీకి ఏర్పాట్లు - Medaram Jathara Prasadam door delivery

Medaram Prasadam: మేడారం వనదేవతల ప్రసాదం డోర్​ డెలివరీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈనెల 12 నుంచి 22 వరకు ఆన్​లైన్​లోనే ఇంటికే ప్రసాదం సేవలు అందించనున్నట్లు మంత్రి వివరించారు.

Medaram
Medaram
author img

By

Published : Feb 7, 2022, 7:19 PM IST

Updated : Feb 8, 2022, 7:50 AM IST

Medaram Prasadam: మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టీసీ పార్శిల్ సర్వీస్​తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి... ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ లేదా పోస్ట్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం-బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్లనుందని వివరించారు.

బంగారాన్ని అమ్మవారికి సమర్పించిన అనంతరం తిరిగి భక్తులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్​లైన్​లో మీసేవ లేదా టీయాప్ ఫోలియో మొబైల్ యాప్​లో బుక్​ చేసుకోవాలన్నారు. అనంతరం వారికి పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు. ఆర్టీసీ పార్శిల్ సేవల ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకునే వారు ఆ సంస్థను సంప్రదించాలన్నారు. ఈ సేవలకుగాను ఒక ప్రసాదం ప్యాకెట్​కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ ద్వారా సేవలను పొందేవారికి ఈ ఛార్జీలు వర్తించవన్నారు.

Medaram
ఆర్టీసీ ఏర్పాట్లు

దూరాన్ని బట్టి ఛార్జీలను ఆర్టీసీ సంస్థ నిర్ణయిస్తుందని.. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు-కుంకుమ, అమ్మవారి ఫొటోను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఈనెల 12-22 వరకు ఆన్​లైన్​లో ఇంటికే ప్రసాదం సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మొక్కులుగా బెల్లం చెల్లించాలనుకున్న వారు తెలంగాణ ఆర్టీసీ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చని ఆర్టీసీ మరో ప్రకటనలో తెలిపింది. మరింత సమాచారం కోసం 040 30102829, 040 68153333 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

Medaram Jatara 2022: ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహాజాతర జరగనుంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. గతంలో అమ్మవారి గద్దెల వద్దకు వెళ్లేందుకు ప్రత్యేక దర్శన సౌకర్యం ఉండేది. కానీ ప్రభుత్వం దానిని తొలగించి వీఐపీ మార్గంగా మార్చింది. ప్రత్యేక దర్శనం ఉన్నప్పుడు దాని నుంచి కొంత ఆదాయం వచ్చేది. అది ఆలయ అభివృద్ధికి ఉపయోగపడేది. ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించాలని సమ్మక్క-సారలమ్మ ప్రధాన పూజారి జగ్గారావు కోరుతున్నారు. భక్తుల సౌకర్యార్థంతో పాటు ఆలయానికి ఆదాయం వస్తుందని అంటున్నారు.

నాలుగు రోజులపాటు ఇలా..

ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను.. 17న సమ్మక్క దేవతను గద్దెలపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది.

ఇదీచూడండి:

Last Updated : Feb 8, 2022, 7:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.