మేడ్చల్ జిల్లా మేడిపల్లి లోని సహజ యోగ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఆన్ లైన్ ద్వారా ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు యోగ కేంద్ర కో ఆర్డినేటర్ మల్లారెడ్డి తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో మార్చి 22 నుంచి మే 5 వ తేదీ వరకు ఆన్లైన్ మెడిటేషన్ యాక్టివిటీస్‌నీ ప్రణాళిక ద్వారా నిర్వహించామన్నారు.
ఇప్పుడు సైతం అలాగే ప్రపంచవ్యాప్తంగా 300పైగా యోగా ధ్యాన కేంద్రాల ద్వారా ఫేస్ బుక్ సోషల్ మీడియా ద్వారా ప్రత్యేక ప్రసారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ధ్యానం చేయడం ఆరోగ్యానికి మంచిదని మల్లారెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్