మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నేరెట్మెట్ పరిధిలోని దీన్ దయాల్ నగర్లో దారుణ హత్య జరిగింది. యాదగిరి అనే మాజీ రైల్వే ఉద్యోగి మొదటి భార్య కొడుకు రెండో భార్యను కర్రతో కొట్టి హతమార్చాడు. యాదగిరి రైల్వే ఉద్యోగిగా పనిచేసి 4 నెలల క్రితం పదవీ విరమణ పొందాడు. మొదటి భార్య, పిల్లలు తనను సరిగా చూసుకునేవారు కాదని యాదగిరి తెలిపాడు. రెండో భార్యపై కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: మహారాష్ట్ర ప్రమాదంలో 20కి చేరిన మృతులు