ETV Bharat / state

మేడ్చల్ జడ్పీ పీఠం ఎవరిది..?

మేడ్చల్ జిల్లాలోని 5 స్థానాలకు గాను తెరాస నాలుగింటిని దక్కించుకొని జడ్పీఛైర్మన్ పదవిని దక్కించుకోబోతోంది. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు జడ్పీ ఛైర్మన్​గా మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యే అవకాశముంది.

author img

By

Published : Jun 8, 2019, 9:52 AM IST

మేడ్చల్ జడ్పీ పీఠం ఎవరిది..?

మేడ్చల్ జడ్పీ పీఠం తెరాస ఖాతాలోకి వెళ్లనుంది. మొన్న వెలువడిన జడ్పీటీసీ ఫలితాల్లో జిల్లాలోని 5 మండలాల్లో తెరాస మెజార్టీ స్థానాలను గెలుచుకొని జడ్పీ ఛైర్మన్ స్థానాన్ని దక్కించుకోనుంది. జిల్లాలోని మూడుచింతలపల్లి మినహా మిగిలిన 4 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. గులాబీ దళానికి చెందిన చెందిన శరత్ చంద్రారెడ్డి జడ్పీఛైర్మన్​గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. గతంలోనే సీఎం కేసీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ఈ మేరకు హామీ ఇచ్చినందున... శరత్ చంద్రారెడ్డిని ఏకపక్షంగా ఎన్నుకునే అవకాశముంది.

మొత్తం 5 స్థానాల్లో తెరాస 4చోట్ల పాగా వేసినందున ఎటువంటి వ్యూహాలు అవసరం లేకుండా తంతు ముగియనుంది. జిల్లా యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద హడావుడి లేకుండా పూర్తి చేసేందుకు సిద్ధమైంది. జడ్పీ ఛైర్మన్​గా ఎన్నిక కానున్న మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కుమారుడు. ఈయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి 2014 లో గెలుపొందారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో మలిపెద్ది సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వని కారణంగా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ప్రకటించి జడ్పీ పీఠాన్ని ఆయన కుమారుడికి ఇస్తానని మాట ఇచ్చారు. ఫలితంగా ఈ ఎన్నిక లాంఛనమే కానుంది. మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి ఘట్​కేసర్ మండలం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు.

ఇవీ చూడండి: ఏకగ్రీవమే లక్ష్యంగా తెరాస ప్రణాళికలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.