మేడ్చల్ జిల్లా కొంపల్లి పురపాలక పరిధిలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటరు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు రేపు జరగబోయే ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులు కోరారు. రేపటి వారి భవిష్యత్ ఈ ఓట్లు పైనే ఆధారపడి ఉందని, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీపరుడికి ఓటు వేయాలని కోరారు.