ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న హాజీపూర్ బాధిత కుటుంబాలను అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఖండించారు. వారిని కలిసేందుకు జవహర్నగర్ పీఎస్కు వచ్చారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం, పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరస హత్యలు చేస్తున్న మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయకుండా బాధితులను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రవిప్రకాశ్ కోసం లుక్ అవుట్ నోటీసులు