ETV Bharat / state

నీటి సంపులో పడి రెండేళ్ల బాబు మృతి - 2 years Boy fell in Water Tank at medchal

అప్పటివరకు కళ్లముందే బుడి బుడి అడుగులతో తిరిగిన బాబు అడుగులు ఆగిపోయాయి. చిలిపి చేష్టలతో తల్లిదండ్రులు కష్టాలను మరచిపోయోలా చేసే ఆ అల్లరి మూగబోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న అమ్మనాన్నలు శోకసంద్రంలో మునిగిపోయారు. నీటి సంపులో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన విషాద ఘటన జీడిమెట్ల పీఎస్​ పరిధిలో జరిగింది.

two years boy died for fell down in water tank
నీటి సంపులో పడి రెండేళ్ల బాబు మృతి
author img

By

Published : Mar 15, 2020, 2:25 PM IST

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ అయోధ్య నగర్​లో విషాదం చోటుచేసుకుంది. కాలనీలో నివాసముంటున్న సంతోష్ కుమార్​ రెండేళ్ల కుమారుడు విజయ్ కృష్ణ. శనివారం రోజు ఇంట్లో తాతయ్యతో అడుకున్నాడు. సంతోష్​ కుమార్​ తండ్రి సాయంత్రం మార్కెట్​కు వెళ్లాడు. చిన్నారి ఇంట్లో లేకపోగా... తాతతో సంతకు వెళ్ళాడేమో అనుకున్నారు.

మార్కెట్ నుంచి వచ్చిన తాతతో పసిపాడు లేకపోవడం వల్ల చుట్టు పక్కల ఇళ్లల్లో ఆరా తీశారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న సంపులో పడి ఉన్న బాబుని చూసిన తల్లిదండ్రులు... హుటాహుటిన సుచిత్రలోని సురక్ష ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాబు మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నీటి సంపులో పడి రెండేళ్ల బాబు మృతి

ఇదీ చూడండి: ఉద్యోగులు పీఎఫ్​ ఎప్పుడెప్పుడు విత్​డ్రా చేసుకోవచ్చంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.