ETV Bharat / state

మేడ్చల్​ జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తం - ఆర్టీసీ డిపో

మేడ్చల్​ జిల్లాలో వివిధ ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితి ఆందోళనకరంగా మారింది.  విధుల్లో చేరడానికి వచ్చిన కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

tsrtc-workers-arrest-in-the-medchal-district-rtc-dipo
మేడ్చల్​ జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తం
author img

By

Published : Nov 26, 2019, 1:13 PM IST

మేడ్చల్ జిల్లాలోని పలు డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ ఐకాస సమ్మె విరమించి కార్మికులను విధుల్లో చేరాలనే పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు డిపోల వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడ్చల్​, కుషాయిగూడ, ఉప్పల్​లోని చెంగిచెర్ల డిపోల వద్ద విధుల్లోకి చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులుకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

మేడ్చల్​ డిపోలో తమను విధుల్లో చేర్చుకోమని ఆందోళన చేపడుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో మహిళా కండక్టర్లకు కానిస్టేబుల్స్ మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో... కార్మికులను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్​కు తరలించారు.

చెంగిచెర్ల ఆర్టీసీ డిపో వద్ద తమను విధుల్లో చేర్చుకోమని డిపో మేనేజర్​కు వినతిపత్రం అందిచగా పైఅధికారుల ఆదేశాల మేరకే మేము మిమ్మల్ని విధుల్లో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు. దీనితో కార్మికులు తీవ్ర ఆంధోళన వ్యక్తం చేశారు.

కుషాయిగూడలో ఉద్యోగులను పోలీసులు అడ్డుకొని లోనికి వెళ్లనీయకపోవడంతో.. వారు అక్కడే ధర్నాకు దిగారు.

మేడ్చల్​ జిల్లాలోని ఆర్టీసీ డిపోల వద్ద పరిస్థితి ఉద్రిక్తం

ఇదీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా డిపోల వద్ద ఉద్రిక్తత..

Intro:TG_HYD_26_26_MEDCHAL_KARMIKULA_ARREST_AV_TS10016

Body:మేడ్చల్ డిపో వద్ద పరిస్తితి ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా డిపో లోకి వెళ్లి బస్ కు అడ్డుపడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు పరుగులు తీశారు. దీనితో పోలీసులకు కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపు డిపో ఎదుట కార్మికులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన చేపడుతున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేసే సమయంలో మహిళా కండక్టర్లకు కానిస్టేబుల్ లకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు కార్మికులను అరెస్టు చేసి దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Conclusion:మేడ్చల్ లో పరిస్తితి ఉద్రిక్తం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.