తెరాస అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి అన్నారు. తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ప్రతాప్‌సింగారం గ్రామంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించలేకపోతున్నామని చెప్పారు. ప్రతి ఇంటిపై పార్టీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు.