ETV Bharat / state

తెరాస సానుభూతిపరులే నా బలం: రేవంత్​రెడ్డి - రేవంత్​రెడ్డి

ప్రచారంలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. రోజుకో నియోజకవర్గంలో నేతలను కలుసుకుంటూ...ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల నుంచి స్పందన బాగుందన్నారు. గులాబీ కార్యకర్తల నుంచి కూడా తనకు అనేక సందేశాలు వస్తున్నాయని ఇప్పుడు వారే తన బలమన్నారు.

కాంగ్రెస్​ను గెలిపించండి
author img

By

Published : Mar 19, 2019, 1:13 PM IST

Updated : Mar 19, 2019, 11:22 PM IST

కాంగ్రెస్​ను గెలిపించండి
మల్కాజిగిరిలో కాంగ్రెస్​ విజయం సాధించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అభ్యర్థి రేవంత్​రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇక్కడ హస్తం జెండా ఎగిరితేనే తెరాస నాయకులకు ప్రగతి భవన్​ గేట్లు తెరుచుకుంటాయని లేకపోతే ఆ ద్వారాల్లో గుత్తేదార్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్ భాజపా నేత గణేష్​ను రేవంత్​రెడ్డి కలసి మద్దతు కోరారు. కాంగ్రెస్​లో చేరితే... సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తెరాసలో వ్యాపారవేత్తలకు మాత్రమే టికెట్లు కేటాయిస్తున్నారని వారిని గెలిపిస్తే ఎంపీ పదవిని స్వలాభాలకే ఉపయోగిస్తారని, ప్రజాసమస్యలు పట్టించుకోరని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తన బలం తెరాస సానుభూతి పరులేనని అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్​లో రహదారి సమస్య కోసం పోరాడతామని స్పష్టం చేశారు.

ఇవీచూడండి:'తొలగించడం అసంభవం..!'

sample description
Last Updated : Mar 19, 2019, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.