ETV Bharat / state

కూకట్​పల్లిలో ప్రైవేట్​ ట్రావెల్ బస్సులో ఎగిసిన మంటలు - కూకట్​పల్లిలో ప్రైవేట్​ ట్రావెల్ బస్సులో ఎగిసిన మంటలు

హైదరాబాద్ కూకట్​పల్లి మెట్రో మాల్​ వద్దనున్న ట్రక్​ పార్కింగ్​లో నిలిపి ఉంచిన ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ వ్యాపించగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Travels_Bus_Fire_Accident at kukatpally, Hyderabad
author img

By

Published : Nov 10, 2019, 12:03 AM IST

హైదరాబాద్ కూకట్​పల్లిలో మెట్రో మాల్​ వద్ద పార్కింగ్​లో ఉంచిన బస్సు నుంచి మంటలు వ్యాపించాయి. గత కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులుండగా బస్సును పార్కింగ్ స్థలంలో యజమాని నిలిపారు. బస్సును 20 రోజుల క్రితం మరమ్మతులు చేయించి రన్నింగ్​లో నిలిపారు. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని స్థానికులు భావిస్తున్నారు.

అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వారు మంటలను ఆర్పారు. కానీ అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పార్కింగ్ స్థలం పక్కనే ఉన్న చెత్తకు మంటలు అంటుకుని బస్సుకు వ్యాపించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

కూకట్​పల్లిలో ప్రైవేట్​ ట్రావెల్ బస్సులో ఎగిసిన మంటలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.