హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న సికింద్రాబాద్-కాకినాడ రైల్లోని ఒక బోగి మంటలకు ఆహుతైంది. అదృష్టవశాత్తు అందులో ఎవరూ ఉండకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా బోగిలోంచి పొగలు రావడం గమనించిన రైల్వే సిబ్బంది అగ్నిపమాక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
నిరుపయోగంగా ఉన్న ఆ బోగి మంటల్లో పూర్తిగా దగ్దమైంది. ఈ ప్రమాదం విద్యుదాఘాతంతో జరిగిందా లేక ఇంకెమైన కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇదీ చూడండి: సంజయ్ మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు!