ETV Bharat / sports

సంజయ్ మంజ్రేకర్​పై బీసీసీఐ వేటు! - సంజయ్ మంజ్రేకర్​ తొలగింపు

ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్​పై బీసీసీఐ వేటు వేసినట్లు తెలుస్తోంది. అతడి పనితీరు పట్ల అధికారులు సంతోషంగా లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంజయ్ మంజ్రేకర్
సంజయ్ మంజ్రేకర్
author img

By

Published : Mar 14, 2020, 1:10 PM IST

టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు, ప్రముఖ క్రికెట్‌ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్‌పై బీసీసీఐ వేటు వేసినట్లు తెలుస్తోంది. బీసీసీఐ కామెంటరీ ప్యానెల్‌ నుంచి అతడిని తొలగించారని సమాచారం. కొన్నేళ్లుగా భారత స్వదేశీ మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అతను ఈసారి ఐపీఎల్‌లోనూ కనిపించకపోవచ్చు. అయితే మంజ్రేకర్‌ను తొలగించడానికి గల కారణాలు తెలియరాలేదు. బీసీసీఐ అధికారులకు అతని పనితీరు నచ్చలేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

"ఐపీఎల్‌ ప్యానెల్‌ నుంచి కూడా అతడిని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది మా ఆలోచనల్లో లేదు. అసలు నిజం ఏంటంటే మంజ్రేకర్‌ పనితీరు పట్ల అధికారులు సంతోషంగా లేరు"

-బీసీసీఐ అధికారి

మంజ్రేకర్‌ గతేడాది రెండుసార్లు సామాజిక మాధ్యమాల్లో టీమ్‌ఇండియా అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. తొలుత ప్రపంచకప్‌ సందర్భంగా రవీంద్ర జడేజాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. తర్వాత తోటి వ్యాఖ్యాత హర్షాభోగ్లే సామర్థ్యాలను ప్రశ్నించాడు. ఈ రెండు సంఘటనలకు సంబంధించి అతడు క్షమాపణలు చెప్పినా సోషల్‌ మీడియాలో నెటిజెన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.