మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీసులు గండి మైసమ్మ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... అటుగా వచ్చిన ఓ యువకుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు అతన్ని పట్టుకుని విచారించగా... బైక్లు, సెల్ఫోన్లు దొంగతనం చేసేవాడని తేలింది.
మామిడాల శ్రీకాంత్ సూర్యాపేట జిల్లా వాసి అని.. అతను గతంలో దొంగతనం కేసులో 9 నెలలు జైలుకెళ్లి వచ్చాడని, పాత నేరస్థుడని విచారణలో తెలిసింది. అతన్ని లోతుగా విచారించగా... శ్రీకాంత్ నిత్యం మద్యం, గంజాయి, పొగ త్రాగడం లాంటి చెడు అలవాట్లకు బానిసై, డబ్బుల కొసం దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
అతను మొత్తం 12 చరవాణీలు, 3 బైక్లు దొంగతనం చేశాడని చెప్పారు. శ్రీకాంత్ వద్ద నుంచి వస్తువును స్వాధీనపరచుకుని వాటి బాధితులకు అవి అందిస్తామని... నిందితున్ని రిమాండ్కు తరిస్తున్నట్టు బాలానగర్ డీసీపీ పద్మజరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి : 'ఆమె ఇద్దరితో ప్రేమాయణం నడిపింది'