ETV Bharat / state

"స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేతపై కేసు"

స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేత పై మేడ్చల్‌ జిల్లా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదుతో వెంకటేష్ పై క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

"స్ట్రాంగ్‌ రూమ్‌లో ఫొటో దిగిన తెరాస నేతపై కేసు"
author img

By

Published : Apr 13, 2019, 7:52 PM IST

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లో తెరాస నేత ఫొటో దిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఎస్వీఆర్.చంద్రశేఖర్ ఫిర్యాదుతో వెంకటేష్ పై క్రైమ్ నెం 149/2019, అండర్ సెక్షన్ 447, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యంత నిఘా ఉండే గదుల్లో ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగింది...
మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారం గ్రామంలోని హోలీమేరి కళాశాల (లెక్కింపు కేంద్రం)లో మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్ల ఈవీఎంలను భద్రపరిచారు. కంటోన్మెంట్‌కు సంబంధించిన సామగ్రి భద్రపరిచిన గదిలో కీసరకు చెందిన తెరాస నేత వెంకటేష్‌ గురువారం అర్ధరాత్రి ఫొటో దిగాడు.
స్ట్రాంగ్‌ రూంలో ఫొటోలు, వీడియోలు నిషేదం...
ఇక్కడ భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించేందుకు అధికారులు వివిధ పార్టీలకు చెందిన ఏజెంట్లు, నాయకులను ఆహ్వానించిన సందర్భంలో అతడు ఫొటో దిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంలో ఫొటోలు దిగడం, వీడియోలు తీయడం నిబంధనలకు విరుద్ధమని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Intro:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాంతంలో నిన్న రాత్రి ఈదురు గాలుల వీయడం తో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం లోని వరి పండించే రైతులు పంట మొత్తం నేల రాలడం తో తలలు పట్టుకుంటున్నారు. వరి మొత్తం నేలకు వరగడం వల్ల వడ్లు నేల రాలుతున్నాయి.

Body:మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రాంతంలో నిన్న రాత్రి ఈదురు గాలుల వీయడం తో వరి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతం లోని వరి పండించే రైతులు పంట మొత్తం నేల రాలడం తో తలలు పట్టుకుంటున్నారు. వరి మొత్తం నేలకు వరగడం వల్ల వడ్లు నేల రాలుతున్నాయి.

Conclusion:9949336298

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.