ETV Bharat / state

'హరితహారం-6లో చింతచెట్ల పెంపకంపై ప్రధానంగా దృష్టి' - హరితహారం మొక్కల పెంపకం - తాజా వివరాలు

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 20 నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు 3.5కోట్ల మొక్కలు అటవీశాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది చింత చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి వివరించారు.

Monkey's Rehabilitation Center in Nirmal Said by Indrakaran Reddy
నిర్మల్​లో కోతుల పునరావాస కేంద్రం : ఇంద్రకరణ్​ రెడ్డి
author img

By

Published : Jun 5, 2020, 1:31 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఆరో విడత హరితహారం కార్యక్రమం ఈనెల 20 నుంచి ప్రారంభమవుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యయనం చేశారని... రాష్ట్రంలో ఎన్ని మొక్కలు అందుబాటులో ఉన్నాయో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. అటవీశాఖ వద్ద మూడున్నర కోట్ల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చింతపండును ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా... ఈ ఏడాది కోటి చింత మొక్కలు ప్రత్యేకంగా నాటనున్నట్లు పేర్కొన్నారు. అలాగే కోతుల బెడదను తప్పించుకునేందుకు మరో నెల రోజుల్లో నిర్మల్​లో నూతనంగా కోతుల పరిరక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని కోసం హిమాచల్​ప్రదేశ్​లో ఉన్న కోతుల పరిరక్షణ కేంద్రాన్ని రాష్ట్ర అధికారుల బృందం అధ్యయనం చేసిందని వివరించారు. బౌరంపేటలోని ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి... ఈ వివరాలను వెల్లడించారు.

నిర్మల్​లో కోతుల పునరావాస కేంద్రం : ఇంద్రకరణ్​ రెడ్డి

ఇదీ చూడండి : ఆదిలాబాద్‌లో గ్యాంగ్‌వార్‌.. పరారీలో తెరాస కౌన్సిలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.