మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిర్వహిస్తోన్న రెండు షాపులు, క్లినిక్లపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు.
మల్లంపేటలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి తెరిచిన ఓ హోటల్, ఎలక్ట్రిక్ షాపును సీజ్ చేశారు. గాగిల్లపూర్, బేరంపేటలో క్లినిక్ తెరిచి వైద్యం చేస్తున్న ఇద్దరు ఆర్ఎంపీ వైద్యులను పట్టుకున్నారు. మొత్తం నలుగురిపై కేసులు నమోదు చేసి వారు నిర్వహిస్తున్న షాపులు, క్లినిక్లను సీజ్ చేశారు. వారిని దుండిగల్ పోలీసులకు అప్పగించారు.