మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ సైనిక్‌పురిలో సేవా భారతి ఆధ్వర్యంలో 5కే రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్సీ రాంచందర్ రావు హాజరయ్యారు. జెండా ఊపి 5కే రన్ ప్రారంభించారు.
ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం ఎంతగానో సహాయపడుతుందని రాంచందర్ రావు అన్నారు. చిన్నారులతో పాటు పెద్దవాళ్లూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు చేసిన డ్యాన్సులు అందరిని అబ్బురపరిచాయి.
ఇదీ చదవండి: బొమ్మల పరిశ్రమకు చేయూతగా కేంద్రం ప్రణాళిక!