మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు 44వ రోజు సమ్మెలో భాగంగా బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నియంత్రించారు. కార్మికులకు పోలీసులకు మధ్య కొంతసేపు తోపులాట జరిగింది.
అనంతరం పోలీసులు కార్మికులను అరెస్ట్ చేసి జీడిమెట్ల పీఎస్‌కి తరలించారు. తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె విరమించేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: దీక్షలు, ధర్నాలు, అరెస్టులు... రాష్ట్రం రణరంగం