మేడ్చల్ జిల్లా జీడీమెట్ల పీఎస్ పరిధి షాపూర్ నగర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు యూటర్న్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కంటైనర్ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో వెనక సీట్లో కూర్చున్న యాదగిరి (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ముందు సీట్లో కూర్చున్న వారికి బెలూన్లు తెరుచుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.
తీవ్ర గాయాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరు మద్యం మత్తులో కారులో ప్రయాణించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: సోమవారం నుంచి మరో 200 ప్రత్యేక రైళ్లు