లాక్‌డౌన్‌తో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వరాష్ట్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వారి కోసం కేటాయించిన ప్రత్యేక రైళ్లల్లో పలువురు కార్మికులు తరలిపోయారు. మరికొంత మంది కార్మికులు ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌స్టేషన్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఇవాళ మేడ్చల్ పోలీస్ స్టేషన్ ముందు మండు ఎండను లెక్క చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవటం కోసం కార్మికులు బారులు తీరారు. పోలీసులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వలస కార్మికుల పూర్తి వివరాలు సేకరించారు.
మమ్ముల్ని స్వగ్రామాలకు పంపించండి - వలస కూలీల బతుకు ఛిద్రం!
స్వస్థలాలకు వెళ్లేందుకు వివరాల నమోదు కోసం వలస కూలీలు పోలీస్‌స్టేషన్ల బాట పట్టారు. సొంతూర్లకు వెళ్లేందుకు అనుమతులు ఇవ్వాలంటూ అభ్యర్థించారు. వారిచ్చిన సమాచారం మేరకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.