కరోనా కట్టడి కోసం లాక్డౌన్ను నేటి నుంచి పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. 10 దాటాక రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు.
ఉదయం 10 తరువాత కూడా వాహనాల సంచారం ఉండటంస పోలీసుల తనిఖీలతో కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనుమతి పత్రాలు ఉన్న వాహనాలనే పోలీసులు అనుమతిస్తున్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను జప్తు చేస్తున్నారు. ఉదయం 10 గంటలలోపే పనులన్నీ ముగించుకోవాలని ఎంత చెబుతున్నా.. ప్రజలకు పట్టడం లేదు. 11:30 గంటల సమయంలోనూ ఇష్టారీతిన రోడ్లపై తిరుగుతున్నారు.
ఇదీ చూడండి: పకడ్బందీగా లాక్డౌన్.. ఉల్లంఘించిన వారిపై చర్యలు