మేడ్చల్ శామీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీపీఆర్ పైపుల పరిశ్రమలో అగ్నీకీలలు ఎగిసిపడుతున్నాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే పైపులు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ మంటలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. షార్ట్ సర్క్యూటా లేక మరేదైనా కారణమా..అనేది తేలాల్సి ఉంది.
ఇవీ చదవండి:యువకుడి హత్య... గ్రామస్థుల ప్రతీకారం...