ETV Bharat / state

కరోనా ఐసోలేషన్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - పీర్జాదిగూడలో కరోనా ఐసోలేషన్​ సెంటర్​ ప్రారంభం

దాతల సహకారంతో మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్​ సెంటర్​ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కరోనాతో కుటుంబసభ్యులతో సహా తాను ఎంతో ఇబ్బంది పడ్డానని.. ఆ పరిస్థితి రాకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి పేర్కొన్నారు.

peerzadiguda covid isolation centre opened by minister mallareddy
పీర్జాదిగూడలో కరోనా ఐసోలేషన్​ సెంటర్​ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
author img

By

Published : Aug 21, 2020, 2:41 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో దాతల సహకారంతో కొవిడ్-19 ఐసోలేషన్​ సెంటర్​ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, రాచకొండ సీపీ మహేశ్​ భగవత్, జడ్పీ ఛైర్మన్ శరత్​చంద్రారెడ్డి, మేయర్ జక్కా వెంకట్​ పాల్గొని ఐసోలేషన్ సెంటర్​ను ప్రారంభించారు. కరోనా వైరస్​ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరూ కరోనా నివారణ చర్యలను తప్పనిసరిగా పాటించాలని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు, తన కుటుంబానికి వైరస్​ సోకడం వల్ల.. అనేక ఇబ్బందులు పడ్డామని ఆయన వెల్లడించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలను మంత్రి కొనియాడారు. అనంతరం దాతలు ఏర్పాటు చేసిన 130 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.