వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలంలోని ప్రతాపసింగారం, మాదారం, ఏదులాబాద్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా 6,400 వరి కొనుకోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీఛైర్మన్ ఎం.శరత్‌చంద్రారెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ నందారెడ్డి పాల్గొన్నారు.