మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఈసీఐఎల్ క్రాస్ రోడ్డులో ఎన్ఎస్యూఐ ధర్నా నిర్వహించింది. ఏఐఈఈఈ, నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. పరీక్షలు వెంటనే రద్దు చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది.
కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాయడానికే పరీక్షలు నిర్వహిస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. కరోనాతో జనం చనిపోతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయన్నారు.
ఇవీ చూడండి: హరితవనంగా గ్రేటర్ హైదరాబాద్: మేయర్ బొంతురామ్మోహన్