బాచుపల్లి ఎస్సీ కాలనీలో 15 రోజులుగా మంచి నీరు రావడం లేదని నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీటి సరఫరా విషయమై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పినా.. కమిషనర్ ముకుందరెడ్డి పెడచెవిన పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి: చచ్చిపోతారని భయపెట్టారు... ఆదివాసీలను దోచేశారు!