పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. ఆరో విడత హరితహారం కార్యాక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కవాడిగూడ డివిజన్ చిత్రా నగర్ బస్తీలో ఆయన మొక్కలు నాటారు. ప్రభుత్వ లక్ష్య సాధనకోసం పార్టీ శ్రేణులు అందరూ పాటుపడాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేసి భవిష్యత్తు తరాలకు కాలుష్య రహిత వ్యవస్థను ఇవ్వాలని ముఠా గోపాల్ అన్నారు. ప్రతి కుటుంబానికి ఆరు మొక్కలు ఇచ్చి... వాటిని నాటి.. అవి ఎదిగేవరకు సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు.