సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే... 'కేటీఆరే ముఖ్యమంత్రి' అంశం తెరమీదకు తెచ్చారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్, గుండ్ల పోచంపల్లి పట్టణాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా పంచాయతీ రాజ్ చట్టాన్ని నిర్మించారని రేవంత్ ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్‌కే ఓటెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.