తెరాస పాలనలో హైదరాబాద్ మహానగరలో అభివృద్ధి ఏమీ జరగలేదని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మంచి నీరు, రహదారులు, పారిశుద్ధ్యం లాంటి మౌలిక సౌకర్యాలు అన్నీ కూడా కాంగ్రెస్ హయంలో జరిగినవేనని ఆయన స్పష్టం చేశారు. దీనిపై స్థానిక కాంగ్రెస్ నాయకులతో చర్చించేందుకు తెరాస నాయకులు సిద్ధమా అని సవాల్ విసిరారు.
భూకబ్జాలు, అనుమతి లేని భవంతుల నిర్మాణంలో తెరాస నేతలు పోటీ పడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. మంత్రులు మొదలు కార్పొరేటర్ల వరకు పిశాచుల్లా ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అడిగే వారు లేకపోవటం వల్లే తెరాస ఆగడాలు పరాకాష్టకు చేరాయన్న రేవంత్ రెడ్డి... మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి తెరాసను గెలిపిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసరాజు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్‌తోపాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నేడు రాజ్భవన్లో రాష్ట్రపతికి విందు