పంట సాగులో ప్రతి రైతు సృష్టికర్తే అని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ ఛైర్మన్ ఎం.శరత్ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్ శక్తులు వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల 1980 నుంచి రైతులు దోపిడీకి గురవుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
గత పాలకుల తప్పిదాల వల్లే వ్యవసాయంపై రైతులకు విరక్తి కలిగిందని మల్లారెడ్డి ఆరోపించారు. తెరాస అధికారంలోకి వచ్చాక అన్నదాతలను ఆదుకోవటానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. సేంద్రియ ఎరువుతో పంటలు పండించాలని రైతులకు సూచించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా