కరోనా కట్టడిలో భాగంగా వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు చేస్తున్న సేవలు... ఎంతో అభినందనీయమని భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలిపారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఓల్డ్ అల్వాల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రులో సేవలందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి ఆయన పౌష్టికాహార పదార్థాలను, పండ్లను పంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని రామచంద్రరావు సూచించారు. వైద్య సిబ్బంది నిద్రాహారాలు మాని, తమ కుటుంబాలను వదిలి.. ప్రజల ప్రాణాలను రక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ సూచించిన విధంగా ప్రజలంతా లాక్డౌన్ పాటించడం వల్ల దేశంలో కొవిడ్ ఉద్ధృతి కొంతమేర తగ్గిందని ఆయన అభిప్రాయపడ్డారు.