ముషీరాబాద్ నియోజకవర్గంలో చిట్టడవుల పెంపునకు తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ హామీ ఇచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడలో ఉన్న దేవుని తోటలో హరితహారంలో భాగంగా ఆయన మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు, కార్పొరేటర్ తదితరలు పాల్గొని మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణకు మొక్కలను విస్తృత స్థాయిలో పెంచడానికి అందరిలో చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అడుగడుగునా మొక్కలు నాటి ప్రాణవాయువు శాతాన్ని మరింత పెంచే దిశగా కృషి చేస్తామన్నారు.