ETV Bharat / state

వరద బాధితులకు.. ఆహార పొట్లాలు పంచిన ఎమ్మెల్యే మైనంపల్లి - హైదరాబాద్​ వరదలు

మేడ్చల్​ జిల్లా మల్కాజ్​గిరిలో వరద బాధితులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆహార పొట్లాలు అందజేశారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ధైర్యం చెప్పారు.

MLA Mainampally Hanmanth Rao Distributes Food PAckets in Malkaj giri
వరద బాధితులకు.. ఆహార పొట్లాలు పంచిన ఎమ్మెల్యే మైనంపల్లి
author img

By

Published : Oct 19, 2020, 7:07 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి చాలామందికి తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాలతో సహా ఇంట్లోని సామాన్లన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కాగా.. మేడ్చల్​ జిల్ల్ మల్కాజ్​గిరిలో వరదల కారణంగా నష్టపోయి.. తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న బాధితులకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు ఆహార పొట్లాలు అందించారు.

ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా.. విరామం లేకుండా ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నానని.. కావాలనే కొంతమంది తనపై విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసత్యాలు ప్రచారం చేస్తున్న వారు తనకు క్షమాపణ చెప్పాలని.. నీళ్లలోనే కూర్చొని నిరసన తెలిపారు. తెరాస ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు బురదలో, వరదలో ప్రజల కోసం అహర్నిశలు పని చేస్తుంటే ఇలా విమర్శలు చేయడం సరికాదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విష ప్రచారాలు, ప్రభుత్వంపై చేసే విమర్శలు నమ్మవద్దని సూచించారు.

ఇవీ చూడండి: ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.