షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన ఓ కుటుంబానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అండగా నిలిచారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాశ్ నగర్ డివిజన్ పరిధిలోని మైత్రి నగర్లో నివాసం ఉంటున్న బ్రహ్మం నాయక్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి బ్రహ్మం నాయక్ ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇంటిని పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.51 వేలు ఆర్థిక సాయం అందజేశారు.
ప్రభుత్వం ద్వారా బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, తగిన పరిహారం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బాధితులకు భరోసానిచ్చారు.
ఇదీ చదవండి: రాజ్నాథ్తో పవార్ భేటీ- రైతు నిరసనలపై చర్చ?