మేడ్చల్ జిల్లా ఆల్విన్ కాలనీలో జోనల్ కమిషనర్ మమత, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, ఎంటమాలజీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దోమలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాల పాటు ఇంటి ఆవరణను శుభ్రం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
దోమల నివారణకు కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, ఎంటమాలజీ అధికారుల ఆధ్వర్యంలో కూకట్పల్లి, ఆల్విన్ కాలనీ డివిజన్లో దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. కాకతీయ నగర్, వెంకట సాయి నగర్ కాలనీల్లోని తిరుగుతూ ఇంటి ఆవరణలో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఇంట్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కాలనీవాసులకు సూచించారు.
ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా