రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ ఉద్యాన, అటవీ సంబంధ మొక్కలు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి(Niranjan reddy on farming) అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కుత్బుల్లాపూర్ మండలం జిల్లా జీడిమెట్లలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఆధునిక వసతులతో రూ.3.75 కోట్లతో నిర్మించనున్న టిష్యూ కల్చర్ ప్రయోగశాల దేశంలో ప్రభుత్వరంగంలోనే మొదటిదని వెల్లడించారు.
ఈ ప్రయోగశాలలో పండ్లు, పూలు, సుగంధ, ఔషధ, అటవీ, అలంకరణ మొక్కలు ఉత్పత్తి చేసి తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు విక్రయించనున్నామని ప్రకటించారు. సంప్రదాయ విధానాలకు భిన్నంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల్లో మొక్కలు పెంచడమే లక్ష్యమని(Niranjan reddy on farming) తెలిపారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కోసం అవసరమైన అన్ని రకాల మొక్కలు సరఫరా చేస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మొక్కల పెంపకానికి, మొక్కల ఉత్పత్తి, పునరుత్పత్తికి ఒక ముఖ్యమైన పరిణామం. ఒకరకంగా చెప్పాలంటే విప్లవం లాంటిదే. రోజూవారీగా మనకు అవసరమైన మొక్కల ఉత్పత్తికి జీవశాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక పెద్ద విప్లవం. ఏ మొక్కలనైనా సరే పెద్దసంఖ్యలో ఉత్పత్తిచేయడానికి ప్రాథమిక మూలకేంద్రంగా ఉపయోగపడుతుంది. ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్‌లో తయారు చేసిన మొక్కలను హరితహారంలో భాగంలో కోట్లాది మొక్కలు ఇవ్వగలిగే స్థితి ఉంటుంది. చాలా సమూలమైన మార్పులకు దారితీస్తుంది. అత్యంతవేగవంతంగా మనం ఆశించిన ఫలితాలు వస్తాయి. తక్కువ సమయంలో మొక్కలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలతో కూడిన పని శరవేగంగా పూర్తిచేస్తాం. చాలాపెద్ద మార్పుకు ఇది శ్రీకారం.
-నిరంజన్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
టిష్యూ కల్చర్ ప్రయోగశాల ప్రారంభించిన నిరంజన్ రెడ్డి
ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, టీఎస్ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే వివేకానంద, కేంద్ర హోం శాఖ జాయింట్ డైరెక్టర్ విజయలక్ష్మి, టీఎస్ సీడ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: KTR: ఈ నెల 25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక: కేటీఆర్