ETV Bharat / state

Mallareddy: అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు బంధు : మల్లారెడ్డి

author img

By

Published : Jun 24, 2021, 10:30 AM IST

రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు పథకాలను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో రైతు బంధు పథకం అమలుపై కమిటీ నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

Minister Mallareddy Review on Raithu bandhu
రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి

రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం కింద నగదు జమ అవుతున్నందున మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రైతు బంధు కమిటీ నాయకులతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

రైతుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. రైతు బంధు లాంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా చూడాల్సిన బాధ్యత రైతు బంధు కమిటీలపై ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశానికి జిల్లా రైతు బంధు కన్వీనర్‌ నందారెడ్డి, నియోజకవర్గం తెరాస బాధ్యులు మహేందర్‌రెడ్డి, శామీర్‌పేట మండల రైతు బంధు అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీలు, సర్పంచులు హాజరయ్యారు.

ఇదీ చూడండి: పట్టణాల అభివృద్ధే ధ్యేయం: మంత్రి మల్లారెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.